తెలంగాణ

telangana

ETV Bharat / state

బల్కంపేట అమ్మవారి కల్యాణానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి' - బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వార్తలు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమ్మవారి కల్యాణ ఆహ్వాన పత్రికను మంత్రికి ఆయన నివాసంలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

talasani
talasani

By

Published : Jun 22, 2020, 6:09 PM IST

కరోనా విజృంభ నేపథ్యంలో మంగళవారం నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను హాజరు కావడం లేదని పేర్కొన్నారు. భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అమ్మవారి కల్యాణ ఆహ్వాన పత్రికను మంత్రికి ఆయన నివాసంలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగరాజ్, ఆలయ ఛైర్మన్ సాయి బాబా గౌడ్, కుమార్, నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : గూగుల్​ పే కస్టమర్​ కేర్​ పేరుతో మోసం

ABOUT THE AUTHOR

...view details