తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో భారీ ఎత్తున హరితహారం: తలసాని

భాగ్యన‌గ‌రంలో ఈ నెల 25 నుంచి ఆగ‌స్టు 15 వ‌ర‌కు ఆరో విడ‌త హ‌రిత‌హారాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అంద‌రికి మొక్కలు అందిస్తామ‌ని వెల్లడించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల‌ని సూచించారు.

minister talasani srinivas participate ktr review meeting on haritaharam at ghmc head office
భాగ్యనగరంలో భారీ ఎత్తున హరితహారం: తలసాని

By

Published : Jun 22, 2020, 6:59 PM IST

మొక్కలు నాట‌డం, కాపాడ‌టం అంద‌రి సామాజిక బాధ్యత అని... ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల‌ని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. పిల్లల‌కు ఆస్తితో పాటు... మంచి ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అందించాలని పేర్కొన్నారు. భాగ్యన‌గ‌రంలో ఈ నెల 25 నుంచి ఆగ‌స్టు 15 వ‌ర‌కు ఆరో విడ‌త హ‌రిత‌హారాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామ‌ని త‌ల‌సాని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హ‌రిత‌హారం అమ‌లుపై మంత్రి కేటీఆర్ సమీక్ష స‌మావేశం నిర్వహించారు. స‌మావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ లోకేశ్​ కుమార్ పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అంద‌రికి మొక్కలు అందిస్తామ‌ని మంత్రి తలసాని వెల్లడించారు. హ‌రిత‌హారంలో న‌గ‌రంలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మొక్కలు నాటాలన్నారు. పార్కులు, అపార్ట్​మెంట్లు, అన్ని ఖాళీ స్థలాల్లో హరితహారం చేప‌ట్టాలన్నారు.

భాగ్యనగరంలో భారీ ఎత్తున హరితహారం: తలసాని

ఇదీ చూడండి:కరోనాతో ఉపాధి కోల్పోయిన 20 లక్షల మంది!

ABOUT THE AUTHOR

...view details