ఈ ఏడాది ప్రతి ఒక్కరు ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఉజ్జయిని మహంకాళి జాతర నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, పండితులు, పోలీసు అధికారులతో మంత్రి సమావేశం జరిపారు.
'ఈ యేడు అంతా ఇంట్లోనే బోనాల పండుగ చేసుకోవాలి' - ఉజ్జయిని మహంకాళి బోనాలపై మంత్రి సమీక్ష
ఉజ్జయిని మహంకాళి జాతర నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది అందరూ ఇళ్లలోనే బోనాల పండుగను జరుపుకోవాలని సూచించారు. ఆలయంలో జరిగే పూజలు యథావిధిగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
'ఈ ఏడాది ప్రతి ఒక్కరు ఇళ్లలోనే బోనాల పండుగ చేసుకోవాలి'
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఆలయం ఆవరణలోనే కార్యక్రమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. భక్తులకు అనుమతి లేకుండా వేడుకలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి:'కరోనా ప్రభావంతో మరణాలు ఏ దశలోనైనా ఉండవచ్చు'