తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccination: సూపర్​ స్ప్రెడర్ల కోసం వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు

కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్​ను ప్రతి ఒక్కరు వేయించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సూపర్​ స్ప్రెడర్ల​ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని... పదిరోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

minister-talasani-srinivas-launched-covid-vaccination-drive-for-the-super-spreaders
Vaccination: సూపర్​ స్ప్రెడర్ల కోసం వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు

By

Published : May 28, 2021, 12:10 PM IST

కరోనా నుంచి రక్షణకు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని... పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో సూపర్ స్ప్రెడర్ల టీకా కార్యక్రమాన్ని జీహెచ్​ఎంసీ మేయర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.

వ్యాక్సిన్‌పై అపోహలు వీడి... ఈ అవకాశాన్ని రాష్ట్రప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:Covid Query: ఫోన్‌కాల్‌ దూరంలో... వైద్య సలహాలు!

ABOUT THE AUTHOR

...view details