తెలంగాణ

telangana

ETV Bharat / state

కోటి కుంకుమార్చన ఉత్సవాల్లో మంత్రి తలసాని ప్రత్యేక పూజలు - ఉజ్జయిని మహంకాళి దేవస్థానం

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతున్న కోటి కుంకుమార్చన ఉత్సవాల ముగింపు సందర్భంగా శాంతి హోమం, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

minister talasani Special worship at mahankali temple
కోటి కుంకుమార్చన ఉత్సవాల్లో మంత్రి తలసాని ప్రత్యేక పూజలు

By

Published : Feb 28, 2020, 1:35 PM IST

సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో జరుగుతున్న కోటి కుంకుమార్చన ఉత్సవాల ముగింపు పురస్కరించుకొని అమ్మవారి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఇక్కడ నిర్వహించిన పూర్ణాహుతి హోమంలో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అన్నపూర్ణ, స్థానిక కార్పొరేటర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.

కోటి కుంకుమార్చన ఉత్సవాల్లో మంత్రి తలసాని ప్రత్యేక పూజలు

ఇదీ చదవండి:'న్యాయ విచారణ కమిషన్ ఉన్నందున ఇప్పుడేం విచారించలేం'

ABOUT THE AUTHOR

...view details