తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధి పథంలో నడిపిస్తూ..​ ఆదర్శంగా నిలిచారు' - ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ అభివృద్ధిపథంలో నడిపిస్తూ.. ఆదర్శంగా నిలిచారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్ అన్నారు. సీఎం పుట్టిన రోజును పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

minister talasani says KCR stands as an ideal in leading the development trajectory
'అభివృద్ధి పథంలో నడిపిస్తూ కేసీఆర్​ ఆదర్శంగా నిలిచారు'

By

Published : Feb 17, 2021, 2:29 PM IST

సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజును పురస్కరించుకుని సికిింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలను చీరలను పంపిణీ చేశారు.

రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడిపిస్తూ.. కేసీఆర్​ ఆదర్శంగా నిలిచారని మంత్రి తలసాని అన్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు, గురుద్వారాలు, మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కేసీఆర్‌ జన్మదినం.. తెలంగాణకు పండుగ దినం: హరీశ్

ABOUT THE AUTHOR

...view details