గొర్రెల కోసం డీడీ రూపంలో వాటా చెల్లించిన 28 వేల మందికి, రెండో విడత ఇవ్వాల్సిన లబ్ధిదారులకు త్వరలో పంపిణీ కార్యక్రమం చేపడతామని పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లోని 7,61,895 మంది సభ్యులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చనున్నామని తెలిపారు.
త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ: తలసాని - మంత్రి తలసాని తాజా వార్తలు
రాష్ట్రంలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లోని 7,61,895 మంది సభ్యులకు లబ్ధి చేకూర్చనున్నామని తెలిపారు.
త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ: తలసాని