గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్రవారం కొత్తగా మరో 25 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 4, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ 4, డిప్యూటీ స్పీకర్ పద్మారావు 2, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ 2, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 2, మేయర్ బొంతు రాంమోహన్ మూడు చొప్పున ప్రారంభించనున్నారు.
రేపు గ్రేటర్లో మరో 25 బస్తీ దవాఖానాలు ప్రారంభం - ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 170 బస్తీ దవాఖానలు
బస్తీల్లో ఉండే ప్రజల కోసం హైదరాబాద్‌లో కొత్తగా మరో 25 బస్తీ దవాఖానాలు రేపు ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే 170 గ్రేటర్ పరిధిలో ప్రారంభించామని వెల్లడించారు.
రేపు గ్రేటర్లో మరో 25 బస్తీ దవాఖానాలు ప్రారంభం
మిగతా చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు... పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడుతాయన్నారు. ఇప్పటికే గ్రేటర్లో 170 దవాఖానాలు ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తవాటి ప్రారంభంతో వీటి సంఖ్య 195కు చేరుతుంది.
ఇదీ చూడండి :పొంగిపోర్లుతోన్న లక్నవరం చెరువు, జంపన్న వాగు