తెలంగాణ

telangana

ETV Bharat / state

'బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష' - GOVERNMENT RELEASES RS.100 CRORES

బోనాల పండుగకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. గోల్కొండతో మొదలై సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ, పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలతో పండుగ ముగియనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రాదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు బోనాల పండుగ ఎంతో దోహదం చేసిందన్నారు మంత్రి తలసాని. బోనాలకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది.

బోనాలకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం : మంత్రి తలసాని

By

Published : Jun 30, 2019, 8:18 AM IST

Updated : Jun 30, 2019, 9:02 AM IST

'బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష'

బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. వచ్చే నెలలో నిర్వహించే బోనాల పండుగ ఏర్పాట్లపై హైదరాబాద్ సాలర్ జంగ్ మ్యూజియంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జులై 4 తేదీన గోల్కొండ బోనాలతో పండుగ మొదలు కానుంది. తర్వాత జులై 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ బోనాలు నిర్వహించనున్నారు.
'బోనాలకు రూ.100 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం'
27, 28 తేదీల్లో పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు జరుగనున్నాయి. పండుగ నేపథ్యంలో ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. నగరంలోని బస్తీ దేవాలయాల ఆధునీకీకరణకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందని మంత్రి తలసాని వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల పండగను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
'అన్ని దేవాలయాలకు కళాకారులను పంపిస్తాం'
తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని ప్రతిబింబించే విధంగా బోనాల పండుగ నిర్వహిస్తామని సంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ అన్నారు. గతేడాది 152 దేవాలయాలకు...28వేల మంది కళాకారులను పంపించినట్లు చెప్పారు. ఈసారి అన్ని దేవాలయాలకు పంపిస్తామన్నారు.
'స్త్రీల కోసం ప్రత్యేక చర్యలు'
బోనాల పండుగ నేపథ్యంలో స్త్రీల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పండుగ నేపథ్యంలో బాణసంచా కాల్చొద్దని.. పర్యావరణానికి ముప్పు కలిగించొద్దని చెప్పారు. అన్ని ఉత్సవ కార్యక్రమాలు వీడియో తీస్తామని...కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించి ప్రజల రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి : 'దివ్యాంగులకు కల్యాణలక్ష్మి సహాయం పెంపు'

Last Updated : Jun 30, 2019, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details