తెలంగాణ

telangana

ETV Bharat / state

RIVIEW: అభివృద్ది పనులపై సమగ్ర నివేదిక అందజేయండి: తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజా వార్తలు

వర్షాకాలంలో గ్రేటర్‌ వాసులు ఇబ్బందులు పడకుండాచూడాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను అందజేయాలని ఆదేశించారు.

By

Published : Jun 7, 2021, 7:26 PM IST

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేసి.. వర్షాకాలంలో గ్రేటర్‌ వాసులు ఇబ్బందులు పడకుండాచూడాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జోనల్ కమిషనర్‌లు, జలమండలి అధికారులతో వర్షాకాల సన్నద్ధతపై మంత్రి సమీక్షించారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా పలు నిర్మాణ పనులు మందగించాయన్న ఆయన ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున పనులను వేగవంతం చేయాలన్నారు.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. బీకే గూడ పార్క్ సమీపంలో శిథిలావస్థకు చేరిన జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయానికి నాలుగున్నర కోట్లు మంజూరయ్యాయని.. నిర్మాణ నమూనాను సిద్దం చేయాలని సూచించారు. సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్న మంత్రి తలసాని.. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:Harish Rao : కలెక్టర్ జీతం కంటే.. రైతుకు వచ్చే లాభాలెక్కువ

ABOUT THE AUTHOR

...view details