హైదరాబాద్ జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో జనవరి 6వ తేదీన నిర్వహించే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రంగనాథ స్వామి దేవాలయ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
'తిరుపతికి వెళ్లలేని వారు ఇక్కడికి వస్తారు'
హైదరబాద్లోని జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో జరగబోయే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
'తిరుపతికి వెళ్లలేని వారు ఇక్కడికి వస్తారు'
ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తామని, తిరుపతికి వెళ్లలేని వారు ఎంతో నమ్మకంతో ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సదుపాయాలతో పాటు వారి రక్షణ కోసం పోలీసుల బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటివి కూడా చేస్తామని మంత్రి తలసాని తెలిపారు.
ఇదీ చూడండి: రెండో రోజు కన్నులపండువగా అతిరుద్ర మహాయాగం