రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు.
పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లేటెస్ట్ వార్తలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటమని చెప్పినందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌కు తలసాని కృతజ్ఞతలు తెలిపారు.

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను 'ఆకుపచ్చ తెలంగాణ'గా మార్చే ఆలోచనతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి తెలిపారు. దీని స్ఫూర్తితో ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారని.. తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో భాగమవ్వమని విజ్ఞప్తి చేసినందుకు ఎంపీకి తలసాని కృతజ్ఞతలు తెలిపారు.
TAGGED:
hyderabad haritharam news