Balkampet Ellamma: హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ రథోత్సవం రాత్రి కన్నుల పండువగా జరిగింది. అమ్మవార్ల రథోత్సవాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఊరేగింపు సందర్భంగా బల్కంపేట పరిసర ప్రాంతాలన్నీ భక్త జనసంద్రాన్ని తలపించాయి. ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
Balkampet Ellamma: కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం.. హాజరైన తలసాని - బల్కంపేట ఎల్లమ్మ
Balkampet Ellamma: హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ రథోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. అమ్మవార్ల రథోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రథోత్సవ ఊరేగింపు సందర్భంగా బల్కంపేట పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం
శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటాల మధ్య భక్తిశ్రద్ధలతో రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవానికి భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, ఆలయ ఈవో అన్నపూర్ణ, స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు. రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.