ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని హెచ్ఎండీఏ భగాయత్‌లో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భవనం కోసం కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డితో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: తలసాని - latest news of talasani plated a tree at uppal
డబ్బుతో వర్షాన్ని కొనలేమని కేవలం సమృద్ధిగా చెట్లను పెంచడం ద్వారా సకాలంలో వర్షాలను.. కలుష్య రహిత పర్యావరణాన్ని అందిపుచ్చుకోవచ్చని మంత్రి తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని హెచ్ఎండీఏ భగాయత్‌లో ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డితో కలిసి ఆయన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
![ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: తలసాని minister talasani participated haritha haram program at uppal in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7829644-99-7829644-1593505185558.jpg)
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి:మంత్రి తలసాని
భావితరాల కోసం బాధ్యతగా మొక్కలు నాటాలని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. చెట్లను పెంచడం ద్వారా సమృద్ధిగా వర్షాలు, కాలుష్య రహిత పర్యావరణాన్ని అందింపుచుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి:59 చైనా యాప్‌లపై నిషేధం