తెలంగాణ

telangana

ETV Bharat / state

పాల సేకరణ-ఉత్పత్తికి డోకాలేదు: తలసాని - పాల సేకరణ-ఉత్పత్తికి డోకాలేదు: తలసాని

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న తరుణంలో రాష్ట్రంలోని పాడి రైతులు, డెయిరీ యజమానుల సమస్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పాడి రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు.

Minister Talasani On Milk
పాల సేకరణ-ఉత్పత్తికి డోకాలేదు: తలసాని

By

Published : Mar 28, 2020, 3:55 PM IST

రాష్ట్రంలో పాడి రైతులు, డెయిరీ యజమానులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో డెయిరీ యజమానులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ జంట నగరాల్లో పాల ఉత్పత్తి, సేకరణ, సరఫరాలపై సమీక్షించారు.

రైతుల నుంచి పాల సేకరణ, ప్రొసెసింగ్‌, పంపిణీలో ఇబ్బందులు... కుటుంబాలకు చేర్చడంలో ఎదురవుతున్న అవాంతరాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే 040-23450624, 9848022055 నంబర్లకు ఫోన్ ఫోసి తమ దృష్టికి తీసుకురావొచ్చని చెబుతున్న మంత్రి శ్రీనివాసయాదవ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.

పాల సేకరణ-ఉత్పత్తికి డోకాలేదు: తలసాని

ఇదీ చూడండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details