ఈనెల 5 నుంచి వరద ముంపు బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు నామన శేషు కుమారి, అత్తిలి అరుణ గౌడ్, కొలన్ లక్ష్మి, ఆకుల రూప, కుర్మ హేమలత, ఉప్పల తరుణి, సెంట్రల్ జోన్, నార్త్ జోన్ జోనల్ కమిషనర్లు ప్రావీణ్య, శ్రీనివాస్ రెడ్డి, డీసీలు గీతా రాధిక, ముకుందరెడ్డిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
5న అమీర్‌పేట డివిజన్లోని రేణుకానగర్, వెంకటేశ్వర టెంపుల్.. బేగంపేట డివిజన్లోని భగవంతాపూర్, తబేలా, దేవిడి.. సనత్‌నగర్ డివిజన్లోని డీఎన్ఎమ్ కాలనీ, శివాజీ నగర్, చాణక్య నగర్.. రాంగోపాల్‌పేట డివిజన్లో ఓల్డ్ బోయిగూడ, కుర్మ బస్తీ, రంగ్రీజ్ బజార్.. మోండా మార్కెట్ డివిజన్లో సాంబమూర్తి నగర్, బండిమెట్, సజ్జన్ లాల్ స్ట్రీట్.. బన్సీలాల్‌పేట డివిజన్లో సోమప్ప మఠం, నీలం బాలయ్య దొడ్డి, అరుణ్ జ్యోతి కాలనీల్లో అధికారులు బాధిత కుటుంబాల ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వం సాయం రూ.10 వేలు అందజేస్తారని మంత్రి వివరించారు.