తెలంగాణ

telangana

ETV Bharat / state

Talasani on theatres: సినిమా టికెట్ల కోసం త్వరలో ఆన్‌లైన్‌ పోర్టల్‌ : తలసాని - సినిమాపై తలసాని

TALASANI
సినీ పరిశ్రమపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

By

Published : Jan 12, 2022, 11:45 AM IST

Updated : Jan 12, 2022, 12:24 PM IST

11:42 January 12

సినీ పరిశ్రమపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani on theatres: సినీ పరిశ్రమపై మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ సమస్యలపై సత్వరమే స్పందిస్తున్నామని.. ఈ రంగంపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని తెలిపారు. సినీ పరిశ్రమపై ప్రభుత్వం బలవంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు మరింత ఉద్ధృతంగా ఉంటే ఆంక్షలు తప్పవన్నారు. త్వరలోనే సినిమా టికెట్ల కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్​ వెల్లడించారు.

సినీ పరిశ్రమ పుంజుకుంది

Talasani on cinema tickets: కరోనా తర్వాత అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని మంత్రి తలసాని అన్నారు. రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచి.. ఐదో ఆటకు అనుమతి ఇచ్చామని తెలిపారు. సినిమాకు కులం, మతం, ప్రాంతాల వంటి తేడాలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే సినిమా అని తలసాని నిర్వచించారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు.

Last Updated : Jan 12, 2022, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details