హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గంలోని పద్మారావునగర్ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పద్మారావునగర్‌లో రూ. 42 లక్షల వ్యయంతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బలరాం కాలనీలో రూ.13 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును స్థానిక కార్పొరేటర్ హేమలతతో కలిసి ఆయన ఆరంభించారు. అక్రమ కట్టడాలతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తలసానికి విన్నవించగా వెంటనే ఆ విషయంలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అస్తవ్యస్తంగా ఉన్న ఫుట్‌పాత్‌లను మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు.
'పద్మారావునగర్ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం' - హైదరాబాద్ ఈరోజు వార్తలు
సనత్‌నగర్ నియోజకవర్గంలోని పద్మారావునగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అస్తవ్యస్తంగా ఉన్న ఫుట్‌పాత్ పనులకు మరమ్మతు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తలసాని
పార్క్‌ల్లో పచ్చదనాన్ని పెంపొందించే విధంగా మొక్కలు నాటాలని తెలిపారు. అభినవ్ నగర్లో మూడు లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులను మొదలు పెట్టారు. ఆరు లక్షల రూపాయల వ్యయంతో మున్సిపల్ పార్కులు ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి :ఏం చేశారని నిలదీసిన స్థానికుడు... కోపానికొచ్చిన మంత్రి
Last Updated : Feb 24, 2020, 7:44 PM IST