తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరేళ్లలో ఎప్పుడైనా ప్రశ్నించావా ?: తలసాని - హైదరాబాద్​ ముషీరాబాద్​లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

ఆరేళ్లలో ఎనాడైనా నిరుద్యోగుల సమస్యలపై భాజపా ఎమ్మెల్సీ ప్రశ్నించారా అని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్​ ముషీరాబాద్​లోని ఓ ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

minister talasani in mlc election campaign in musheerabad in hyderabad today
ఆరేళ్లలో ఎప్పుడైనా ప్రశించావా ? : తలసాని

By

Published : Feb 27, 2021, 6:59 PM IST

Updated : Feb 27, 2021, 8:17 PM IST

పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆరేళ్లలో గొంతు విప్పని ఎమ్మెల్సీ రాంచందర్​రావు పట్టభద్రులను ఏమని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. హైదరాబాద్​ ముషీరాబాద్​లోని ఓ ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాజకీయంలో గెలుపు ఓటములు సర్వ సాధారణమని... నిరాశకు లోనుకాకుండా తెరాస అభ్యర్థి వాణీదేవి విజయానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. అధికారంలో ఉంటే ప్రజాసమస్యలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించుకోవచ్చని తెలిపారు. కేవలం ప్రశ్నిస్తే సమస్య పరిష్కారం కాదని అధికారం ఉంటేనే సాధ్యమవుతుందని తలసాని పేర్కొన్నారు.

ఇదీ చూడండి :450 కేసులు పెండింగ్​లో ఉన్నాయి: పద్మనాభరెడ్డి

Last Updated : Feb 27, 2021, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details