సాల్వేషన్ ఆర్మీ చర్చ్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ఉన్న నార్త్ జోన్ పోలీసులకు పోషక పదార్థాలను అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం రోడ్లపై సేవలందిస్తున్న పోలీసులకు పౌష్టికాహారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసులకు పోషక పదార్థాలు పంపిణీ చేసిన మంత్రి - talasani latest news
సికింద్రాబాద్లోని చెక్ పోస్ట్ వద్ద పోలీసులకు పోషక పదార్థాలు పంపిణీ చేశారు. మంత్రి తలసాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పోలీసులకు పోషక పదార్థాలు పంపిణీ చేసిన మంత్రి
పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో చర్చ్ చేపడుతోన్న సేవా కార్యక్రమాలను మంత్రి ప్రసంసించారు. ప్రస్తుత పరిస్థితిలో పేదలకు అండగా ఉండేందుకు సంస్థ ముందుకు రావడాన్ని అభినందించారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య