అఖిలపక్షం పేరుతో కొందరు నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. ఎవరికి ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
వలస కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు అందించిన ఘనత మా ప్రభుత్వానిదే అని మంత్రి పేర్కొన్నారు. వలస కార్మికులను బస్సుల్లో వెళ్లాలంటే ఎన్నో రోజులు పడుతుంది.. వారిని రైళ్లలో తరలించాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. మా సలహాలు, సూచనలను పాటించి రైళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు.