హైదరాబాద్ నగరాన్ని గత ఏడేళ్లలో సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించి పేదలకు పునరావాసం కల్పిస్తామని తెలిపారు. నేటి నుంచి వారం రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నాలాలను ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేస్తానన్న ఆయన బేగంపేటలో నాలా పూడికతీత పనులను పరిశీలించారు.
హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు: మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజా వార్తలు
నాలలపై ఉన్న ఆక్రమణలు తొలగించి పేదలకు పునరావాసం కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేటలో నాలా పూడికతీత పనులను పరిశీలించిన ఆయన వివిధ శాఖల సమన్వయంతో నాలాల ప్రక్షాళన కోసం ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నట్లు తెలిపారు.
బేగంపేట నాలాను పరిశీలించిన మంత్రి తలసాని
వర్షాకాలం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకున్నామని తలసాని చెప్పారు. వివిధ శాఖల సమన్వయంతో నాలాల ప్రక్షాళన కోసం స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:'ఈటల భాజపాలో చేరడం.. మరొక గొంగళిపురుగును కౌగిలించుకోవడమే'