సికింద్రాబాద్‌లోని మోండామార్కెట్, బేగంపేట డివిజన్లలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెరాసను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పరిధిలోని సాంబమూర్తి నగర్, పాటిగడ్డ ప్రాంతాల్లో పర్యటించారు.
జీహెచ్ఎంసీలో మంత్రి తలసాని ముమ్మర ప్రచారం - బల్దియా పోరు
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోండామార్కెట్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీలో మంత్రి తలసాని ముమ్మర ప్రచారం
మోండామార్కెట్ అభ్యర్థి ఆకుల రూప, బేగంపేట అభ్యర్థి మహేశ్వరికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచాక వరద బాధితులకు ఆర్థికసాయం అందిస్తామని మంత్రి తెలిపారు.