తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లా పనిచేస్తున్నారు: మంత్రి తలసాని - హైదరాబాద్​ తాజా వార్తలు

కొవిడ్​-19 నివారణలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కొనియాడారు. వారు సైనికుల్లా పనిచేస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్​లో వందమంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసరాలు అందజేశారు. వారిని ప్రశంస పత్రాలతో సన్మానించారు.

పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లా పనిచేస్తున్నారు: మంత్రి తలసాని
పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లా పనిచేస్తున్నారు: మంత్రి తలసాని

By

Published : May 12, 2020, 4:46 PM IST

కరోనా వైరస్ నివారణలో పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లాగా పని చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. వారి సేవలకు కృతజ్ఞతగా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మికుల సన్మాన కార్యక్రమంలో ప్రశంస పత్రాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం వంద మంది పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి తలసాని నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి సరకులు అందిస్తున్నామని ఫౌండేషన్ ఛైర్మెన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ఇదీ చదవండిఃహైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

ABOUT THE AUTHOR

...view details