తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిలోఫర్​ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ - fruits distribution at niloufer by minister talasani

హైదరాబాద్​ నాంపల్లిలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెరాస ఇన్​ఛార్జి ఆనంద్​కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రిలో రోగులకు, వారి బంధువులకు ఎమ్మెల్సీ ప్రభాకర్​తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పండ్లు పంపిణీ చేశారు.

fruits distribution at niloufer by minister talasani
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిలోఫర్​ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

By

Published : Jul 24, 2020, 11:58 AM IST

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను హైదరాబాద్​లో తెరాస నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తన జన్మదిన వేడుకలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వగా.. గులాబీ శ్రేణులు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నాంపల్లిలో తెరాస ఇన్​ఛార్జి ఆనంద్​కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు.

నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఎమ్మెల్సీ ప్రభాకర్​తో కలిసి రోగులకు, వారి బంధువులకు భౌతిక దూరం పాటిస్తూ పండ్లు పంపిణీ చేశారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించే బయటకు రావాలని మంత్రి సూచించారు. మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తలసాని ఆకాంక్షించారు.

ఇవీ చూడండి:కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details