జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు ప్రధానపోటీ కాంగ్రెస్‌తోనేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. గ్రేటర్లో తెరాస వందకుపైగా సీట్లు సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వరదసాయాన్ని నిలిపివేయించారని అన్నారు. కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదని తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తాం: తలసాని - హైదరాబాద్ సమాచారం
గ్రేటర్ ఎన్నికల్లో వందకుపైగా సీట్లను తెరాస కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వరదసాయం ఒక్కరూపాయి అందలేదని అన్నారు. జీహెచ్ఎంసీలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనేనని వెల్లడించారు.
![జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తాం: తలసాని Minister Talasani comments on GHMC Elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9585085-962-9585085-1605712301389.jpg)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తాం: తలసాని
కొన్ని పార్టీలు ప్రభుత్వంపై కావాలనే విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కూడ వరదసాయం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మీసేవల ద్వారా దరఖాస్తు చేసుకున్న బాధితుల ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో మా కుటుంబసభ్యులెవరూ పోటీ చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు.