రాష్ట్ర ప్రభుత్వం హోటల్ మేనేజ్మెంట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆనందోబ్రహ్మా అనే హోటల్‌ను ఆయన ప్రారంభించారు. హోటల్ రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడిందని.. త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని మంత్రి అశాభావం వ్యక్తం చేశారు.
'హోటల్ మేనేజ్మెంట్ రంగానికి అధిక ప్రాధాన్యం' - తలసాని హోటల్ మేనేజ్మెంట్ వార్తలు
హోటల్ మేనేజ్మెంట్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హోటల్ రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడిందని త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని అశాభావం వ్యక్తం చేశారు.
హోటల్ ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని
సాఫ్ట్‌వేర్ ఉద్యోగైన ప్రవీణ్ హోటల్ మేనేజ్మెంట్ రంగంలోకి రావడం పట్ల పలువురు నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో పాటు కార్పొరేటర్ కేతినేని సరళ, పోలీసు అధికారి అజయ్‌కుమార్, హోటల్ ఎండీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.