గీత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని... ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గీత కార్మికులకు ప్రొహిబిషన్, ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్ గ్రేషియా పంపిణీ కార్యక్రమంలో మంత్రితో పాటు శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ పాల్గొన్నారు.
'తెరాస హయాంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేశాం' - Minister Srinivasgoud On Geetha Worker's in Hyderabad
కల్లుగీత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గీత కార్మికులకు రవింద్రభారతిలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
!['తెరాస హయాంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేశాం' Minister Srinivasgoud On Geetha Worker's in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5304588-1012-5304588-1575765887463.jpg)
'తెరాస హయంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేశాం'
700 పైచిలుకు లబ్ధిదారులకు చెక్కులు అందించారు. గీత వృత్తి దారులు ప్రమాదంలో మరణించిన, గాయపడిన బాధితులకు పరిహారం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనుమతి లేకుండా ఈత, తాటి చెట్లను నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వర్గాలకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేసిందని స్వామిగౌడ్ పేర్కొన్నారు.
'తెరాస హయాంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేశాం'
ఇవీ చూడండి:దిశ నిందితుల మృతదేహాలు తరలింపు
Last Updated : Dec 8, 2019, 9:31 AM IST