ఆసియాలోనే అతిపెద్ద టూరిజం స్పాట్ బుద్ధవనం ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. భవిష్యత్తులో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. పర్యాటక స్థలాల అభివృద్ధిపై హైదరాబాద్ రవీంద్రభారతిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆసియాలోనే అతిపెద్ద టూరిజం ప్రాజెక్ట్ ప్రారంభం : శ్రీనివాస్‌గౌడ్ - పర్యాటక అభివృద్ధిపై మంత్రి సమావేశం
రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక స్థలాల అభివృద్ధిపై హైదరాబాద్ రవీంద్రభారతిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అధికారులతో టూరిజంపై మంత్రి సమీక్ష
రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని పలు పర్యాటక స్థలాల అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సర్దార్ సర్వాయ్ పాపన్న కోట మరమ్మతులకు రూ.కోటి 26 లక్షలు, జోగులాంబ ఆలయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రూ.36 కోట్ల 73 లక్షలు, నేలకొండపల్లిలో అభివృద్ధి పనులకు రూ.కోటి 36 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.