తెలంగాణ

telangana

ETV Bharat / state

'దసరా నాటికి గ్రేటర్​లో లక్ష ఇళ్లు పూర్తి'

దసరా నాటికి గ్రేటర్​లో లక్ష ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలపై జరిగిన సమీక్షలో పాల్గొని... పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

minister srinivas yadav on double bed room houses
'దసరా నాటికి గ్రేటర్​లో లక్ష ఇళ్లు పూర్తి'

By

Published : May 20, 2020, 5:21 PM IST

గ్రేటర్‌లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలపై జరిగిన సమీక్షా సమావేశంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో... మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ చర్చించారు.

''ఆగస్టు నాటికి గ్రేటర్​లో 50 వేల ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తాం. దసరా నాటికి గ్రేటర్​లో లక్ష ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇళ్లు లేని వాళ్లందరికీ ఇళ్లు ఇస్తాం. లాక్​డౌన్ సమయంలో ఇళ్ల నిర్మాణాలు ఆగలేదు. శరవేగంగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించాం.''

-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

'దసరా నాటికి గ్రేటర్​లో లక్ష ఇళ్లు పూర్తి'

ఇవీ చూడండి:పోలీసులపై వలస కూలీల రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details