శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అసువులుభాసిన డీఈ శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. హైదరాబాద్ చంపాపేట్‌లోని డీఈ నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
డీఈ శ్రీనివాస్ కుటుంబానికి ఆబ్కారీ మంత్రి పరామర్శ - minister srinivas goud visited de srinivas's family
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
డీఈ శ్రీనివాస్ కుటుంబానికి ఆబ్కారీ మంత్రి పరామర్శ
శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సర్కార్ నుంచి సహాయ సహకారాలు అందించడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట స్థానిక కార్పొరేటర్‌తో పాటు తెరాస నాయకులు ఉన్నారు.
- ఇదీ చదవండి:ఆరు నెలల తర్వాతే కాంగ్రెస్‌కు కొత్త సారథి!