తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న నాటకోత్సవాలను మంత్రి ప్రారంభించారు. విభిన్న సాంస్కృతిక, సంప్రదాయాలకు భాగ్యనగరం నిలయమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉచితంగా ప్రదర్శనలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థులను, యువకులను నాటక రంగం వైపు ఆకర్షించేందుకు పాఠశాల స్థాయి నుంచే నాటక ప్రదర్శనలు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ సంగీత నాటక అకాడమి ఛైర్మన్ శివకుమార్ తెలిపారు. నాటకోత్సవాల్లో భాగంగా తొలి రోజు భాగమతి చారిత్రక నాటకాన్ని ప్రదర్శించారు.