హైదరాబాద్ బంజారాహిల్స్‌లో డా.సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. డా.సి.నారాయణరెడ్డి సారస్వత సదనం ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కళలు, కళాకారులను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రోత్సహిస్తోందని పర్యాటక సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్ - hyderabad latest news
రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కళలు, కళాకారులను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రోత్సహిస్తోందని పర్యాటక సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో డా.సి.నారాయణరెడ్డి జయంతి వేడుకల్లో కేటీఆర్‌తో కలిసి పాల్గొన్నారు.
కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్
డా. సినారె మృత్యర్ధం బంజారాహిల్స్ లో ఇండోర్ ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించి.. 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిందని చెప్పారు. స్వతహాగా కవి, సాహితీవేత్త అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ సినారె ని స్మరించుకుంటూ.. ఈ భవన నిర్మాణానికి సంకల్పించారని తెలిపారు. పాఠ్య పుస్తకాల్లోనూ సినారె చరిత్ర ఉండేలా చొరవ తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు