తెలంగాణ

telangana

ETV Bharat / state

'బీసీ, ఓబీసీల అనైక్యతే వారి వెనుకబాటుకు ప్రధాన కారణం' - Minister Srinivas Goud updates on BC and OBC

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ, ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టెబుల్‌ సమావేశానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ, ఓబీసీలు తమ హక్కుల సాధన కోసం అందరూ కలసి పోరాడాలన్నారు. ఓబీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

Minister Srinivas Goud was attended the the round table meeting organized by BC and OBC Associations as Chief Guest
'బీసీ, ఓబీసీల అనైక్యతే వారి వెనుకబాటుకు ప్రధాన కారణం'

By

Published : Dec 13, 2020, 10:14 PM IST

దేశంలో అధిక జనభా ఉన్న బీసీ, ఓబీసీల అనైక్యతే వారి వెనుకబాటుకు ప్రధాన కారణమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ, ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టెబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీసీ కులాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి అన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయా కులాల అభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు అత్యంత వెనుకబడిన వర్గాలను ఏ నాయకుడూ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో లక్షలాదిమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన చిన్నారులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ బీఎస్‌ రాములు, సభ్యులు కృష్ణ మోహన్‌, ఆయా సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఆడపిల్లకు అండగా హరిదాస్​పూర్... హరిదాస్​పూర్​కు అండగా దాతలు

ABOUT THE AUTHOR

...view details