తెలంగాణ

telangana

ETV Bharat / state

సుద్దాల హనుమంతు పాటలు పోరాటాలకే అంకితం: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ - minister srinivas goud tributes to suddala hanumanthu

భూస్వాముల దురాగతాలను, దౌర్జన్యాలను బుర్రకథల రూపంలో ప్రజలకు సుద్దాల హనుమంతు చాటిచెప్పారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ కొనియాడారు. హనుమంతు జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు.

minister srinivas goud tributes to suddala hanumanthu
సుద్దాల హనుమంతుకు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ నివాళులు

By

Published : Jun 6, 2021, 3:29 PM IST

ప్రజాకవిగా సుద్దాల హనుమంతు.. నిజాం వ్యతిరేకోద్యమంలో ప్రజాబాణీలోనే పాటలతో పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేశారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలు, భూస్వాముల దురాగతాలు, దొరల దౌర్జన్యాలను బుర్రకథల రూపంలో ప్రజలకు చాటి చెప్పారని కొనియాడారు. సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా మంత్రుల నివాస ప్రాంగణంలోని తన నివాసంలో.. ఆయన చిత్రపటానికి శ్రీనివాస్ గౌడ్‌ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హనుమంతు పాటలను ఆయన కుమారుడు సుద్దాల అశోక్‌తేజ పాడి వినిపించారు. కరోనా కారణంగా రవీంద్రభారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయామని.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అశోక్ తేజ హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:Putta madhu: కవిత, సంతోష్​పై ఈటల వ్యాఖ్యలను ఖండించిన పుట్ట మధు

ABOUT THE AUTHOR

...view details