ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఆశించిన స్థాయిలో పీఆర్సీ ప్రకటిస్తారని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చేసిన వీరోచిత పోరాటాన్ని సీఎం గుర్తుంచుకున్నారని... దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... బీసీ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు.
ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - తెలంగాణ వార్తలు
ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో పీఆర్సీని సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పోరాటాన్ని సీఎం గుర్తుంచుకున్నారని అభిప్రాయపడ్డారు. సమాజ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు.
ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో త్వరలోనే పీఆర్సీ: శ్రీనివాస్ గౌడ్
సమాజ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మంత్రి కొనియాడారు. విద్యార్థులకు గొప్ప భవిష్యత్తును అందించడంలో వారి కృషి మరువలేనిదనన్నారు.
ఇదీ చదవండి:'పుష్ప' విలన్గా మలయాళ నటుడు