నేటి నుంచి 13వ తేదీ వరకు బతుకమ్మ సంబురాల(bathukamma celebrations)ను సాంస్కృతిక శాఖ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలిపే విధంగా వీటి నిర్వహణ చేస్తున్నామన్నారు. రవీంధ్రభారతిలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్(minister srinivas goud) పాల్గొన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల బతుకమ్మ సంబురాలు నిర్వహించలేకపోయామని.. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి నిర్వహిస్తున్నామన్నారు.
ఒక్కోరోజు ఒక్కో మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు(bathukamma celebrations) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మహిళా ఉద్యోగులు, ప్రజా సంఘాలు, గెజిటెడ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, చివరిరోజు ఎమ్మెల్సీ కవిత, పద్మాదేవేందర్ గౌడ్లు పాల్గొంటారన్నారు. మహిళలు ఎక్కడ గౌరవించబడుతారో.. ఆ ప్రాంతం అన్ని విధాలుగా బాగుంటుందన్నారు.
ఈ రోజు నుంచి 13వ తారీఖు వరకు రవీంద్రభారతి వేదికగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తాం. ప్రతి జిల్లాలో కూడా సంబురాలు నిర్వహించనున్నాం. ప్రతి జిల్లాలో మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఘనంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశాం. ఒకప్పుడు బతుకమ్మ పండుగ ఆఫీసుల్లో కాదు కదా.. మాట్లాడలేని పరిస్థితి. బతుకమ్మ పండుగ అంటేనే పండుగేనా అనేలా ఆనాడు అవమానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిత జాగృతి అనే సంస్థను స్థాపించి దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాం.
-శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మంత్రి