రాష్ట్రంలో ఆర్థిక శాఖ పురోగతిలో పర్యటక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో టూరిజం అండ్ హాస్పటలిటీ స్టెనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యాక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి... ఇటీవలే హైదరాబాద్ బిర్యానీకి యునెస్కో నుంచి మంచి గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు.
'ఆర్థిక పురోగతిలో పర్యటక శాఖది కీలకపాత్ర' - హైదరాాబాద్ నగరం గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరాన్ని ఐదేళ్లలో 5 లక్షల మంది విదేశీ పర్యటకులు సందర్శించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ బిర్యానీకి ఇటీవలే యునెస్కో నుంచి మంచి గుర్తింపు లభించిందన్నారు.

'ఐదేళ్లలో హైదరాబాద్‌ని 5 లక్షల మంది సందర్శించారు'