మద్యం షాపుల్లో కల్పించిన రిజర్వేషన్ల తరహాలోనే బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని (reservations implements in bar and restaurants) ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రతి కులస్థులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Goud) తెలిపారు.
Minister Srinivas Goud: 'బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తాం' - తెలంగాణ వార్తలు
బార్ అండ్ రెస్టారెంట్లలో రిజర్వేషన్లు కల్పిసామని(reservations implements in bar and restaurants ) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) తెలిపారు. గౌడ కులస్థులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
రిజర్వేషన్లతో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని... అలాంటి వారు తమకు సంబంధించిన కులవృత్తుల్లో ఆర్థికంగా నిలదక్కుకునేలా కృషి చేస్తున్నామన్నారు. మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. గౌడ కులస్థుల్ని గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయన్న శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Goud) ... ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి:KTR on hyd roads: హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి రూ.5,900 కోట్ల రుణం: కేటీఆర్