క్రీడాకారులు భౌతిక దూరం పాటించడంతో పాటు కోవిడ్‌పై ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనలు పాటించాలని క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రీడాకారుల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం కేసీఆర్ సూచించారని మంత్రి తెలిపారు. సీఎంతో పాటు మంత్రి కేటీఆర్ క్రీడల అభివృద్దిపై ప్రత్యేక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. భారత జట్టు మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
'క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేటపుడు గుంపుగా ఉండొద్దు' - మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన అజారుద్దీన్
రాష్ట్రంలో క్రీడాకారులు ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్ నిబంధనలు పాటించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భారత జట్టు మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షులు అజారుద్దీన్.. మంత్రితో భేటీ అయ్యారు. క్రికెట్ ఆడే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
'క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేటపుడు గుంపుగా ఉండొద్దు'
ఈ సమావేశంలో లాక్‌డౌన్ తర్వాత రాష్ట్రంలో క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ ఆడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ప్రాక్టీసు చేసేటప్పుడు గుంపుగా దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం, మ్యాచ్ గురించి చర్చించడం చేయరాదని మంత్రి అజారుద్దీన్‌కు సూచించారు. మ్యాచ్ ప్రాక్టీసులో తప్పనిసరిగా శానిటైజర్ వాడుతూ మాస్క్‌లు ధరించాలని తెలిపారు.
ఇదీ చూడండి :కృష్ణా జలాల కోసం పూర్తిస్థాయిలో పోరాడతాం: కేటీఆర్
Last Updated : Aug 9, 2020, 5:22 PM IST