రాష్ట్రంలో ఈత వనాల పెంపకమే లక్ష్యంగా పెద్దఎత్తున ఈత, తాటి మొక్కలను నాటాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. దాదాపు 4 వేల గ్రామ పంచాయతీల్లో తాటి, ఈత మొక్కలు నాటడం ద్వారా ఈ వనాలను పెంచాలని మంత్రి సూచించారు.
హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఎక్సైజ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 23న నెక్లెస్‌రోడ్డులో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్ శంకుస్థాపన పనులపై సమీక్షించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆరో విడత హరితహారంలో భాగంగా ఈత, తాటి మొక్కలను పెద్దఎత్తున నాటాలని మంత్రి ఆదేశించారు. తద్వారా కల్తీ కల్లును అరికట్టవచ్చని తెలిపారు. మొక్కలు నాటే సమయంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఫొటోలు తీసి తనకు మెయిల్ చేయాలని సూచించారు.