తెలంగాణ

telangana

ETV Bharat / state

వారిని ఒంటరిగా ఉండకుండా చూసుకోండి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ - coronavirus news

మద్యానికి బానిస అయినవారు ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్‌ అన్నారు. అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

minister srinivas goud review in hyderabad
వారిని ఒంటరిగా ఉండకుండా చూసుకోండి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Mar 30, 2020, 9:24 PM IST

హైదరాబాద్​లో ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఆ శాఖ కమిషనర్​ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం దుకాణాలు మూసివేశామని.. వాటిని తెరిచేందుకు వీలుపడదని మంత్రి స్పష్టం చేశారు. కల్లు, మద్యానికి అలవాటు పడి బానిసలుగా మారిన వారికి.. ఉన్నపళంగా అవి దొరక్క పోవడం వల్ల తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్న విషయంపై చర్చించారు.

మద్యానికి అలవాటు పడి బానిసలుగా మారిన వారి మీద ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు. వ్యసనపరులను గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఎస్సైలకు, సీఐలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యసనపరులు ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మద్యం నుంచి దారి మరల్చేందుకు చెస్‌, క్యారెమ్స్‌, ఇతర ఆటలతో వారి మనసు లగ్నం అయ్యేలా చూడాలన్నారు.

వారిని ఒంటరిగా ఉండకుండా చూసుకోండి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఇవీ చూడండి:ఆదిలాబాద్​ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత

ABOUT THE AUTHOR

...view details