ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శోభ దంపతుల పంచలోహ చిత్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటాన్ని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ప్రగతిభవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్)కు పుట్టినరోజు కానుకగా బహుకరించారు. ఇద్దరు ప్రముఖ శిల్పులు 3 నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారని తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజు నాడు మహబూబ్‌నగర్‌లో ముక్కోటి వృక్షార్చన, రక్తదానం, దివ్యాంగులకు త్రిచక్ర మోటారు వాహనాలను పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇది తనకెంతో అపురూపమైన కానుక అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్ కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితలు పాల్గొన్నారు.
రక్తదానం..
ఈ నెల 24వ తేదీన కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ రక్తదానం చేశారు.
ప్రత్యేక పాట...
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పాటను రూపొందించారు. కేటీఆర్‌పై రూపొందించిన పాటను తెలంగాణ భవన్లో 22వ తేదీన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డితో పాటు పాట దర్శకుడు పూర్ణచందర్, రచయిత మానుకోట ప్రసాద్, సంగీతాన్ని అందించిన బాజీ తదితరులు పాల్గొన్నారు.