తెలంగాణ

telangana

ETV Bharat / state

'దాశరథి రాసిన ప్రతి పదం ప్రజల గుండెల్లో ఉంటుంది' - దాశరథి కృష్ణమాచార్యుల జయంతి

దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. దాశరథి రాసిన ప్రతి పదం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

minister-srinivas-goud-pays-tribute-to-dasarathi-krishnamacharyulu
'దాశరథి రాసిన ప్రతి పదం ప్రజల గుండెల్లో ఉంటుంది'

By

Published : Jul 22, 2020, 12:24 PM IST

రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కవులు, కళాకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని.... పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. మహాకవి దాశరథి కృష్ణమాచార్య 96వ జయంతి సందర్భంగా.... హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు.

''ఆరేళ్లుగా దాశరథి పేరు మీద రవీంద్రభారతిలో అవార్డులు ప్రదానం చేస్తున్నాం. కవులు, కళాకారులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. దాశరథి రాసిన ప్రతి పదం ప్రజల గుండెల్లో ఉంది. తెలంగాణ ప్రజల కన్నీటి గాథలను తన కలంతో రాశారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని ఆయన రాసిన వ్యాఖ్య... ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన సమయంలో ప్రతి బ్యానర్​పై ఉండేది.''

శ్రీనివాస్‌గౌడ్‌, పర్యాటకశాఖ మంత్రి

ప్రతి సంవత్సరం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేవాళ్లం. ప్రస్తుతం కరోనా ఉన్న నేపథ్యంలో ఉత్సవాలు నిర్వహించలేకపోతున్నామని మంత్రి తెలిపారు.

'దాశరథి రాసిన ప్రతి పదం ప్రజల గుండెల్లో ఉంటుంది'

ఇదీ చూడండి:'ఇంటర్నెట్​ దయవల్ల ప్రపంచ క్రీడగా చెస్​'

ABOUT THE AUTHOR

...view details