తెలంగాణ

telangana

ETV Bharat / state

సైనిక హవల్దార్​ కుటుంబానికి అండగా ఉంటాం: శ్రీనివాస్​ గౌడ్​

జమ్మూ కశ్మీర్​ లడక్​లోని లేహ్​లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన సైనిక హవల్దార్​ పరుశురాం మృతి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సంతాపం తెలిపారు. మహబూబ్​నగర్ జిల్లా గువ్వని కుంట తండకు చెందిన పరుశురాం విధినిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతదేహం శనివారం శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకుంది.

సైనిక హవల్దార్​ కుటుంబానికి అండగా ఉంటాం: శ్రీనివాస్​ గౌడ్​
సైనిక హవల్దార్​ కుటుంబానికి అండగా ఉంటాం: శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Dec 27, 2020, 4:18 AM IST

జమ్మూ కశ్మీర్​ లడక్​లోని లేహ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రమదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సైనిక హవల్దార్​ పరశురాం మృతదేహం శనివారం శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకుంది. పరుశురాం భౌతికకాయానికి విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, ఎంపీ రంజిత్​ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్​ రెడ్డి నివాళి అర్పించారు. దేశ సేవలో అసువులు బాసిన పరుశురాం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

పరుశురాం కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీర్ ఆదేశాల మేరకు... రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మహబూబ్​నగర్​లో రెండు పడకగదుల ఇల్లును కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పాటు సైనిక సంక్షేమ నిధి నుంచి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు పరుశురాం భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో శ్రద్ధాంజలి ఘటించారు.

ఇదీ చూడండి:ఆదిలాబాద్​ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి

ABOUT THE AUTHOR

...view details