తెలంగాణ కీర్తి, ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని తెలంగాణ అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సురవరం ప్రతాప రెడ్డి 125వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Srinivas Goud: వచ్చే ఏడాది ప్రతాపరెడ్డి కీర్తి చాటే విధంగా వేడుకలు - మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్తలు
సురవరం ప్రతాపరెడ్డి జయంతిని పురస్కరించుకుని... ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులు అర్పించారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది వైభవంగా నిర్వహించలేకపోయామని... వచ్చే ఏడాది ప్రతాపరెడ్డి కీర్తి చాటే విధంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతాప రెడ్డి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది వైభవంగా నిర్వహించలేకపోయామని... వచ్చే ఏడాది ప్రతాపరెడ్డి కీర్తి చాటే విధంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణను ఎవరైన చిన్నచూపు చూస్తే సురవరం సహించేవారు కాదన్నారు. తెలంగాణలో కవులే లేరంటే... గోల్కొండ పత్రికను స్థాపించి ఎంతో మంది కవులు, సాహితీవేత్తలతో... తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారన్నారు.
ఇదీ చూడండి:Balakrishna: ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి