తెలంగాణ

telangana

ETV Bharat / state

'వారికి మాస్క్​లు, శానిటైజర్లు అందించండి' - Minister srinivas goud latest updates

కరోనా వైరస్​పై ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Minister srinivas goud ordered to supply masks to the visitors
'వారికి మాస్క్​లు, శానిటైజర్లు అందించండి'

By

Published : Mar 4, 2020, 10:02 PM IST

'వారికి మాస్క్​లు, శానిటైజర్లు అందించండి'

రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలకు వచ్చే విదేశీ, స్వదేశీ పర్యాటకులకు మాస్క్​లు, శానిటైజర్లు అందించాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై పర్యాటక, వారసత్వ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రానికి వచ్చే విదేశీ, స్వదేశీ పర్యాటకులను విమానాశ్రయంలో వైద్యపరీక్షలు చేశాక అనుమతిస్తున్నట్లు తెలిపారు.

పర్యాటక ప్రాంతాలతో పాటు బస్సులు, బోటింగ్ ప్రదేశాలు, హరిత హోటళ్లు, సమాచార కేంద్రాల వద్ద కొవిడ్​కు సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వైరస్​పై విస్తృత ప్రచారం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్న మంత్రి... ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

ఇవీ చూడండి:'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'

ABOUT THE AUTHOR

...view details