తెలంగాణ

telangana

ETV Bharat / state

తలసేమియా రోగులకు రక్తమార్పిడి చేస్తేనే బతుకుతారు: మంత్రి

తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం హైదరాబాద్​ నారాయణగూడలోని ఐపీఎంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ప్రారంభించారు. కరోనా సోకిన వారిలో కొందరు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని వారికి రక్తం ఎంతో అవసరమని ​ తెలిపారు.

తలసేమియా రోగులకు రక్తమార్పిడి చేస్తేనే బతుకుతారు: మంత్రి
తలసేమియా రోగులకు రక్తమార్పిడి చేస్తేనే బతుకుతారు: మంత్రి

By

Published : Apr 20, 2020, 4:38 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు పాటించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం హైదరాబాద్​ నారాయణగూడలోని ఐపీఎంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.

కరోనా సోకిన వారిలో కొందరు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని వారికి రక్తం ఎంతో అవసరమని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. రాష్ట్రంలో రక్తం కొరతరాకుండా రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌లో పనిచేస్తున్న పోలీసులు,వైద్య, పారిశుధ్ద్య,రెవెన్యూ తదితర ఉద్యోగులను మంత్రి అభినందించారు.

"తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడి చేస్తేనే బతుకుతారు. ఒకవైపు మనం కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ రక్తం దొరక్కపోతే తలసేమియా రోగులు చనిపోయే ప్రమాదం ఉందని టీఎన్జీవోలు, టీజీవోలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం."

-శ్రీనివాస్ గౌడ్, మంత్రి

తలసేమియా రోగులకు రక్తమార్పిడి చేస్తేనే బతుకుతారు: మంత్రి

ఇదీ చూడండి :గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి

ABOUT THE AUTHOR

...view details