తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని...దీనిని దృష్టిలో పెట్టుకుని పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. చైనా ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చైనా ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించింది. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ట్యాంక్‌బండ్ చుట్టూ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మంత్రి స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు రూపొందించిన పర్యాటక ప్రాజెక్ట్ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంపై చైనా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణ పర్యాటకంపై చైనా ఆసక్తి
హైదరాబాద్ నగరంలో చైనా ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చైనా ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించింది. ట్యాంక్‌బండ్ చుట్టూ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టంచేశారు. తమ దేశంలో పర్యటించాలని ప్రతినిధుల బృందం ఆహ్వానించినట్లు వెల్లడించారు.
తెలంగాణ పర్యాటకంపై చైనా ఆసక్తి