తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు: మంత్రి శ్రీనివాస్​ గౌడ్ - పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్తలు

త్వరలోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వస్తుందని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పర్యటక రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగ్రామిగా నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

minister srinivas goud on tourism in state
'త్వరలోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు'

By

Published : Mar 12, 2020, 3:10 PM IST

పర్యటక రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగ్రామిగా నిలబెట్టేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రామప్ప ఆలయానికి త్వరలోనే యునెస్కో గుర్తింపు వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

'త్వరలోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు'

బొగత జలాశయం వద్ద పర్యటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి వివరించారు. అభివృద్ధికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రకృతి వనరులతోనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. కాళేశ్వం ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దడంపై సీఎం దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు

ABOUT THE AUTHOR

...view details